Thursday, November 28, 2013

దగ్గరవ్వని మనుషుల సావాసం

నీకు దగ్గరవ్వని మనుషుల సావాసం కోరుకుంటే నేర్చుకొనేది గుణపాఠం
నిన్ను కావాలనుకొనే మనుషులను దూరం చేసుకుంటే మిగిలేది పశ్చాత్తాపం.

Saturday, November 23, 2013

సుమధురం

తొలకరి చినుకు పులకరింతలో భువనము, చిన్నారి మేనువు గిలిగింతలో నవ అణువులు వెదజల్లే సువాసన సహజం సుమధురం.

సాగించే జీవిత పయనం ఒకటే

నీ మంచిని మాత్రమే పరిచయం చేసే ప్రేమ పెళ్లి, నీ మంచి చెడు తెలియని పెద్దలు కుదిర్చిన పెళ్లి సాగించే జీవిత పయనం ఒకటే.

దోస్త్ దోస్త్ దోస్త్

గర్ల్ ఫ్రెండ్ వున్న ఫ్రెండ్ గాడి ఆవకాయ్ ఐస్ క్రీమ్ జీవితం గురించి గర్ల్ ఫ్రెండ్ లేని మరో ఫ్రెండ్ ఆవేదన 

మాతో దమ్ముకి కేఫ్ లు, అమ్మాయితో సొల్లుకి కెఫే డేలు
ఇక్కడ బండి మీద బజ్జీలు, అక్కడ డామినో పిజ్జాలు
మా ఫ్రెండ్స్ తో గల్లి మాస్ సినిమాలు, ఆమె ఫ్రెండ్స్ తో ఐమాక్స్ లు సినీ మాక్స్ లు 
ఈడ మందులో తీన్ మార్లు , అక్కడ బంజారాలో డిస్కో జోర్లు
మాకు ఫోన్ లో ఇప్పుడు బిజీ,ఆమెకు చాట్ లో ఎక్కడికైనా రెడీ
మా ఔటింగు కి గండి మైసమ్మ జాతర, ఆమెతో డేటింగు గండి చెరువు పార్కు దగ్గర 

అయినా అవసరమయితే వాడికోసం తన్నడానికైన, తినడానికైన రెడీ, ఎందుకంటే వాడు మా దోస్త్ దోస్త్ దోస్త్ ...

Wednesday, November 20, 2013

ప్రేమ చేరువకాని దూరమయితే

కంటి ముందర మనిషి ప్రేమ మనసు దాకా చేరదు, ఆ ప్రేమ చేరువకాని దూరమయితే జ్ఞాపకాలు మనసు వీడవు.

Tuesday, November 19, 2013

నమ్మకానికి పునాది

అబద్దంతో పరిచయం వ్యసనానికి నాంది, నిజంతో స్నేహం నమ్మకానికి పునాది.

Monday, November 18, 2013

మనిషి జీవిత సూత్రం

కోరుకున్నది దక్కితే అదృష్టం, అనుకోనిది జరిగితే జీవితం. ఇదేనేమో మనిషి జీవిత సూత్రం

Thursday, November 14, 2013

తప్పు లేకుండా

నీ తప్పు లేకుండా ఎదుటి వారు నిన్ను తప్పుగా అనుకుంటే భాధపడడం అనవసరం
నీ తప్పు ఒప్పుకోకుండా ఎదుటివారిది తప్పని వాదించటం అర్ధరహితం

బుడతడి గిన్నెలో పప్పన్నం

దేవుడి గుళ్ళో ప్రసాదం, బుడతడి గిన్నెలో పప్పన్నం అద్బుతః

Wednesday, November 13, 2013

ధరణి

నింగి పరచిన మల్లె మబ్బుల పరుపుయై, ఆ నింగిలోని తారలన్ని మార్లు పడిలేచే తన చిన్నారుల నడకను వీక్షిస్తూ ఆనందపడే అమ్మ ఈ ధరణి.

Sunday, November 10, 2013

నలుగురికి భయపడి

కూతురి పెళ్లి నలుగురు మెచ్చేల ఘనంగా చేసామని ఆనందపడే మీరు, తన కష్టాలలో మీ ఇంటి తలుపు తడితే ఆ నలుగురికి భయపడి తన ఇంట్లో తనే భారమనే భావన కల్పించకండి.

Saturday, November 9, 2013

ఒకే ఒక బంధం శాశ్వతం

స్నేహితుడు తిరుగు స్నేహాన్ని ఆశిస్తాడు,ప్రియుడు లేదా ప్రియురాలు తిరుగు ప్రేమని కోరుకుంటారు
ఇలా ఎన్నో బంధాలలో నువ్వు తిరిగి ఇవ్వలేని రోజున అవి నీతో ఉండకపోవచ్చు.

ఈ లోకంలో నువ్వు ఏమి ఇవ్వకపోయినా ఒకే ఒక బంధం శాశ్వతం, అదే అమ్మ. అందుకేనేమో నీ కసురులు,నీ కోపాలు, నీ అలకలు ఇలా అన్ని అమ్మపైనే.
కాని ఆ అమ్మ చివరి గడియల్లో కోరుకొనే ఒకే ఒక్క కోరిక ఆ హృదయం నేర్పిన నాలుగు ప్రేమ మాటలు.

Tuesday, November 5, 2013

అందరూ నీవాళ్ళే

సుఖంలో నీ కంటికి అందరూ నీవాళ్ళే, కాని కష్టాన నీ మనసు వెతికేను అసలెందరు నా వాళ్ళని.

Sunday, November 3, 2013

బలమైన బంధం

బలమైన బంధం అంతరానికి తావు లేని ఇద్దరి మనుషులది కాదు, ప్రతి అంతరాన సర్దుకు పోయే ఇద్దరి మనసుల జీవిత పయనం.