Monday, March 30, 2015

D27

తాళి బొట్టు కట్టాలంటే చేతిలో కొత్తింటి తాళాలు పెట్టాలి
తలంబ్రాలు పోయాలంటే బంగారు ఆభరణాలు అర్పించుకోవాలి
ఎడడగులు వేయాలంటే ఎకరాలు రాసివ్వాలి.

ఇలా వున్నోడిస్తూనే వున్నాడు, లేనోడు చస్తూనే వున్నాడు
ఆశున్నోడు అడుగుతూనే వున్నాడు,కష్టాల్లో వున్నోడు కన్నీళ్ళతో కాళ్ళు కడుగుతునే వున్నాడు
చదువుకున్నోడూ సాంప్రదాయమని సరిపెడుతున్నాడు, కానుకలు చదివించే కన్నోళ్ళు ఇదేం వ్యాపారమని లోలోన కుమిలిపోతున్నారు.
చూసేవాడికే అది పచ్చటి పందిరి, పెళ్ళనే సందడి
పిల్లని పంపి పందిరి దింపిన పేదోడికి చివరకి మిగిలేవి తీరని అప్పులు, తమ చిన్నారి జ్ఞాపకాలే.

ఆకలికి తెలుసు అన్నం విలువ, రైతన్నకి తెలుసు మట్టి చలువ
ఇలా అన్నీ అడుక్కునేవాడికేం తెలుసు అమ్మాయి విలువ.


Sunday, March 29, 2015

D26

అడిగితే చేసేది సాయం, అవసరం తెలుసుకొని అడిగేది స్నేహం.