Wednesday, April 1, 2015

D28

ఏంచేస్తావురాంటే అదేం ప్రశ్న ఇంజనీరింగే కదాని అప్లికేషన్ పట్టి
ర్యాంకు ఎంతంటే అదెందుకులే అన్నోడి కాలేజిలో ఫీజు కట్టి
గ్రూపేదంటే ఏదైతే నీకేంలే ముందు అమీర్పేటా అమెరికానాని కనిపెట్టి కదిలితే
మూడు సార్లు వీసావోళ్ళు మళ్ళపోదువులేంటే మావాడు అమీర్పేటకి,  ముప్పై జాబులోల్లు మళ్ళరాపో అంటే నేను అమెరికాకొచ్చిపడ్డా .

మనిషి జీవితానికి నాలుగు దశలు, మావాళ్ళ జీతానికీ నాలుగే దిశలు
బాల్యం, ఇంజనీరింగ్, అమీర్పేట, అమెరికా......  

Monday, March 30, 2015

D27

తాళి బొట్టు కట్టాలంటే చేతిలో కొత్తింటి తాళాలు పెట్టాలి
తలంబ్రాలు పోయాలంటే బంగారు ఆభరణాలు అర్పించుకోవాలి
ఎడడగులు వేయాలంటే ఎకరాలు రాసివ్వాలి.

ఇలా వున్నోడిస్తూనే వున్నాడు, లేనోడు చస్తూనే వున్నాడు
ఆశున్నోడు అడుగుతూనే వున్నాడు,కష్టాల్లో వున్నోడు కన్నీళ్ళతో కాళ్ళు కడుగుతునే వున్నాడు
చదువుకున్నోడూ సాంప్రదాయమని సరిపెడుతున్నాడు, కానుకలు చదివించే కన్నోళ్ళు ఇదేం వ్యాపారమని లోలోన కుమిలిపోతున్నారు.
చూసేవాడికే అది పచ్చటి పందిరి, పెళ్ళనే సందడి
పిల్లని పంపి పందిరి దింపిన పేదోడికి చివరకి మిగిలేవి తీరని అప్పులు, తమ చిన్నారి జ్ఞాపకాలే.

ఆకలికి తెలుసు అన్నం విలువ, రైతన్నకి తెలుసు మట్టి చలువ
ఇలా అన్నీ అడుక్కునేవాడికేం తెలుసు అమ్మాయి విలువ.


Sunday, March 29, 2015

D26

అడిగితే చేసేది సాయం, అవసరం తెలుసుకొని అడిగేది స్నేహం.

Sunday, February 8, 2015

D24

ప్రేమ పంచుకుంటే పెరుగుతుంది, అర్ధం చేసుకుంటే అసలు బాధ తెలుస్తుంది.
పది మంది చుట్టూ తిరిగేది పరువు, పొగిడితే పరుగులెడుతుంది, ఛీ కొడితే చిన్నబోతుంది.
మందనొదిలి మదినడిగితే చెబుతుంది ప్రేమ ముందు పరువెంత పనికిమాలిందో.

అమ్మయినా, అమ్మాయినైనా ప్రేమించే మా మనసొకటే.
పరువు తీసేదే  ప్రేమని మీరంటే , అమ్మా నాన్నలుగా మీ ప్రేమకర్దమే లేదు. 

Sunday, January 18, 2015

D23

నేను ఇచ్చాననుకుంటే అప్పు, ఇవ్వాలనుకుంటే సాయం.
వాడివ్వాలనుకుంటాడు, అది వాడి గొప్పతనం, మీరది వాడుకోవాలనుకుంటే చివరకి మీకు కరువయ్యేది ఆ మానవత్వమే.

Monday, January 12, 2015

D22

మావా  మందేద్దామా అంటే..
మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం, మధ్యలోనే వదిలేసిపోయే మగువను ప్రేమించటం మనసుకి ప్రమాదకరమని మతి తప్పి తిరుగుతున్నాడ్రా వాడు..

Saturday, January 10, 2015

D21

నాకన్నీ వున్నాయి, కానీ .... అనంటే నాకున్నవేవీ నాతో లేవన్నట్టే .