Sunday, February 8, 2015

D24

ప్రేమ పంచుకుంటే పెరుగుతుంది, అర్ధం చేసుకుంటే అసలు బాధ తెలుస్తుంది.
పది మంది చుట్టూ తిరిగేది పరువు, పొగిడితే పరుగులెడుతుంది, ఛీ కొడితే చిన్నబోతుంది.
మందనొదిలి మదినడిగితే చెబుతుంది ప్రేమ ముందు పరువెంత పనికిమాలిందో.

అమ్మయినా, అమ్మాయినైనా ప్రేమించే మా మనసొకటే.
పరువు తీసేదే  ప్రేమని మీరంటే , అమ్మా నాన్నలుగా మీ ప్రేమకర్దమే లేదు. 

Sunday, January 18, 2015

D23

నేను ఇచ్చాననుకుంటే అప్పు, ఇవ్వాలనుకుంటే సాయం.
వాడివ్వాలనుకుంటాడు, అది వాడి గొప్పతనం, మీరది వాడుకోవాలనుకుంటే చివరకి మీకు కరువయ్యేది ఆ మానవత్వమే.

Monday, January 12, 2015

D22

మావా  మందేద్దామా అంటే..
మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం, మధ్యలోనే వదిలేసిపోయే మగువను ప్రేమించటం మనసుకి ప్రమాదకరమని మతి తప్పి తిరుగుతున్నాడ్రా వాడు..

Saturday, January 10, 2015

D21

నాకన్నీ వున్నాయి, కానీ .... అనంటే నాకున్నవేవీ నాతో లేవన్నట్టే .

Sunday, December 28, 2014

D20

నేనెందుకిలా వున్నానో తెలియని నీకు, నువ్వలా ఎందుకు చేయలేవని చెప్పడం చాలా సులువు.

D19

నచ్చని మాటలు వింటూ నలుగురిలో నవ్వుతూ నటించలేవు
చుట్టాల చావుకెళ్ళి బాధలేకున్నా బోరుమని ఏడవలేవు
నీలో వున్న మనిషి ఒక్కడే, నువ్వు మాట్లాడే మాటొక్కటే, అందుకే వీళ్ళందరికి నచ్చంది నువ్వొక్కడివే.
నీలా ఒక్కరోజుంటేనే తెలిసింది నేస్తం నేనంటే గిట్టని వాళ్ళింతమందుంటారాని.

Thursday, December 25, 2014

D18

చెప్పాలనుకున్న సమయం నాకున్నా, అర్ధం చేసుకొనే సందర్బం నీది కాదంటే
సర్లేని సందర్బం కోసం నేను వేచుంటే, దేనికోసమో నేనగాలేనంటూ నను దాటిందీకాలం.

ప్రేమున్నా కాలం కరుణించక, పద్దతున్నా పరిస్థితుల పరీక్షలో ఓడిన జంటలెన్నో.