Thursday, May 21, 2015
Wednesday, May 6, 2015
నాతో ఎప్పుడూ నవ్వుతూ వుండే నీ కోపం చూడలేనిది

నా తప్పును కూడా ముక్కుసూటిగా చెప్పే నీ మౌనం భరించరానిది .

Friday, May 1, 2015
అమ్మ భాష
ఇంగ్లీషు, అమ్మాయికి ఐలవ్యు అని చెప్పడానికి బాగుంటుదేమో గాని అమ్మని అన్నం పెట్టమని అడగడానికి సరిపోదు.
నా బాధ బయటోళ్ళకి బోధపడాలంటే ఇంగ్లీషు కావాలిగాని, నా వాళ్ళకి నేనుగా కనపడ్డానికి తోడుకాదది.
పరభాష మరో ప్రపంచాన్ని నాకు దగ్గర చేసేదయితే, మాతృభాష నా ప్రపంచాన్ని నాకెప్పుడూ దూరం కాకుండా చూసేది.
పిల్లలు అన్నీ నేర్వాలి అలాగే అమ్మ భాషా వినాలి
అదే మనల్ని మళ్ళీ చేరువచేసే పిలుపు, ఆ మాటల్లో మెదిలేవన్నీ మన జ్ఞాపకాలే.

Wednesday, April 22, 2015
ఆ కన్నీళ్ళు తుడుచుకొని త్వరగా వెనక్కి వచ్చేయ్ నేస్తమా
అమ్మాయి నీదే అయితే నువ్వెళ్ళే దారిలో ఎదురొస్తుంది లేదంటే నువ్వొచ్చేవరకు నీకెదురుచూస్తుంది.
మీకంటే ముందే మీ దారులు కలిసాయి, మీ కంటిచూపుకందే మార్గమే మీరు కలవబోయే తీరం.
నీకందనిదేదైనా వుంటే ఆ మార్గం నీది కాదులే నేస్తమా, ఆ కన్నీళ్ళు తుడుచుకొని త్వరగా వెనక్కి వచ్చేయ్..
నీ దారిలో నీతోడే కాదు నీకోసం తారాడే మనుషులెందరో ఎదురుచూస్తున్నారు... వచ్చేయ్

Saturday, April 18, 2015
Monday, April 13, 2015
ఏం జరుగుతుంది భయ్యా?
పెళ్ళిలో పెళ్లి కూతురు కదా తలదించుకునేది, పెళ్ళికొచ్చిన వీల్లందరికేమైంది?
కాఫీకెళితే అందరూ చేతుల్తో పైకి,కిందకి, పక్కకని సైగలు చేస్తున్నారు, ఈ ఆఫీసంతా మూగోల్లెనా?
వాడేంటి నడుస్తూ పైకి చూడకుండా సరాసరి అమ్మాయిల బాత్రూంకి వెళ్తున్నాడు?
నిన్న రెస్టారెంట్లో మా బావ, ఓ చేత్తో ఏదో చేస్తూ ఈ చేత్తో ఏం తింటున్నాడో కూడా చూసుకోడేంటి?
చివరగా నిన్న మీ ఇంటికెలితే అందరూ ఓ చోటే వున్నారుగాని ఎవర్నెవరూ పట్టించుకోరేంటి?
ఏం జరుగుతుంది భయ్యా? నాకేదో అయ్యింది, డాక్టర్ కి ఫోన్ చేయమంటావా?
.......బాబూ, డాక్టర్ కాదుగాని ముందు నువ్వా డబ్బా ఫోన్ పాడేసి స్మార్ట్ ఫోన్ కొనుక్కో.

ఆదరిస్తే ఇవే మన బలమై మనతో సాగే ఆయుధాలు
మనసిచ్చుకొని దగ్గరవుతారు, ఆ మనసు నొచ్చుకొనే దూరమవుతారు.
దూరం మనుషుల్లో ప్రేమని పెంచుతుంది, అదే దూరం మనసుల మధ్య చేరితే బంధాన్ని తెంచుతుంది.
బంధం బాధల్లోను మన తోడొస్తుంది, ఆ బంధం తన విలువనే కోల్పోతే క్షణాల్లో మనల్ని ఒంటరిని చేస్తుంది.
ఆదరిస్తే ఇవే మన బలమై మనతో సాగే ఆయుధాలు,లేదంటే మనపై తిరగబడి మనల్నే ఓడించే శత్రుమూకలు.
Wednesday, April 8, 2015
మేనేజర్ బాధితులు
ప్రియమైన మా మేనేజర్ మంకులత గారికి,
మేమీ ఉత్తరం మీరు మారతారన్న ఆశతో రాయట్లేదు, మాలాంటి వాళ్ళు ఇంకెందరో ఆరిపోతారేమోన్న ఆవేదనతో మొదలెడుతున్నాము.
క్లాసులో పిల్లల్లాగా, మీరు ఆఫీసోచ్చేసరికి అందరూ ఉండాలి అన్నీ సర్దుకొనేప్పుడూ అగుపడాలి.
మీరోచ్చేది మధ్యలో, వాగేదంతా ఫోన్లో, మాకు పనిచ్చేదేమో చీకట్లో.
జైల్లో వున్నోడు కూడా సూర్యోదయం, సూర్యాస్తమయం చూస్తాడు. మేమేమో మీరోస్తేగాని పొద్దెక్కదని పనిస్తేగాని పొద్దుదిగదని అనుకుంటూ గడుపుతుంటాం.
ఎండ్ ఆఫ్ ది డే అంటే ఆఫీసు అయిపోతే అంటారనుకొనేవాళ్ళం , మా ఎండ్ చూసేవరకు ఆఫీసు అయిపోదనేది ఇక్కడికొచ్చాకనే తెలిసింది.
సెలవని మీ దగ్గరికి వెళ్ళాలంటే క్యాజ్వల్ లీవ్ అడగడానికి కాశ్మీర్ బార్డర్ చేరుతున్నంత భయం.
ఫోన్లో అందరికి అన్నీ చేస్తానని మాటిస్తారు, ఆదివారాలు రమ్మని మా తాట తీస్తారు.
పనిచేసి తలెత్తుకొని ఇంటికెల్లాల్సిన మావాళ్ళు , తల తిప్పితే మీకెక్కడ పట్టుబడిపోతారోనని దొంగల్లా తప్పించుకు తిరుగుతున్నారు.
ఏదైనా ప్రాబ్లమంటే మీటింగు రూమంటారు , మా బాధ మెమరీ చిప్ అంత చిన్నదయితే మీ సమాధానం
మేమసలెందుకొచ్చామో కూడా మర్చిపోయి మతితప్పి తిరిగేంతలా వుంటుంది.
రేటింగంటారు, మీటింగు పెడతారు, మాకు కోటింగిస్తారు.
బయటకొచ్చాక తెలుస్తుంది అది రేటింగు కాదు చీటింగని.
ఇక జూనియ్యర్లంటే మీకు అడ్డమీద దొరికే కూలీల లెక్క
రాత్రి లేదు బాత్రూం లేదు, అవసరముందా ఫోన్ కొట్టు పనికి పెట్టు.
మీకు ఒక్కసారైనా ఎదురు తిరిగి మాట్లాడినోడు మాకు హీరో.
ఆ తరువాతే, వాడ్ని సైడ్ క్యారెక్టర్లకి కూడా పనికిరాని జీరోని చేస్తారు.
మీరు పెట్టె గోల్స్ అసలీ గ్లోబ్లో వుంటాయా అనిపిస్తుంటది.
అది తెలిసికూడా ట్రై చేసేవాడు పిచ్చోడు, తెలియక చేసేవాడే కొత్తగా వచ్చిన బకరగాడు.
వాళ్ళంతా కాలేజీ ర్యాగింగుల్లో కింగులు, ఇప్పుడు మీతో వుంటే తెలుస్తుంది వాళ్ళకి వాటి అసలర్ధాలేంటో
అన్నట్టు ఒక ఐడియా, మీ ఇంట్లో పనులు కూడా గోల్స్ లో ఆడ్ చేసి చూస్తే పోలా , కనీసం అదొక్కటైనా చేసి చస్తారేమో చూద్దాం.
మీ జీవితమేంటో మాకు తెలియదు, కాని అందరి జీవితాలు మీలా వుంటాయనుకోవడం అన్యాయం కదమ్మా మంకు..
మీలాంటి మేనేజర్లు వున్నంతవరకు సాఫ్ట్వేర్ జాబంటే నరకం, స్కూల్ లైఫే ఆనందం, కాలేజోక అద్భుతమని అనిపిస్తూనేవుంటుంది.
ఇట్లు
మీ బాధితులు

Sunday, April 5, 2015
Saturday, April 4, 2015
అమ్మ భాష
ఇంగ్లీషు, అమ్మాయికి ఐలవ్యు అని చెప్పడానికి బాగుంటుదేమో గాని అమ్మని అన్నం పెట్టమని అడగడానికి సరిపోదు.
నా బాధ బయటోళ్ళకి బోధపడాలంటే ఇంగ్లీషు కావాలిగాని, నా వాళ్ళకి నేనుగా కనపడ్డానికి తోడుకాదది.
పరభాష మరో ప్రపంచాన్ని నాకు దగ్గర చేసేదయితే, మాతృభాష నా ప్రపంచాన్ని నాకెప్పుడూ దూరం కాకుండా చూసేది.
పిల్లలు అన్నీ నేర్వాలి అలాగే అమ్మ భాషా వినాలి
అదే మనల్ని మళ్ళీ చేరువచేసే పిలుపు, ఆ మాటల్లో మెదిలేవన్నీ మన జ్ఞాపకాలే.
నా బాధ బయటోళ్ళకి బోధపడాలంటే ఇంగ్లీషు కావాలిగాని, నా వాళ్ళకి నేనుగా కనపడ్డానికి తోడుకాదది.
పరభాష మరో ప్రపంచాన్ని నాకు దగ్గర చేసేదయితే, మాతృభాష నా ప్రపంచాన్ని నాకెప్పుడూ దూరం కాకుండా చూసేది.
పిల్లలు అన్నీ నేర్వాలి అలాగే అమ్మ భాషా వినాలి
అదే మనల్ని మళ్ళీ చేరువచేసే పిలుపు, ఆ మాటల్లో మెదిలేవన్నీ మన జ్ఞాపకాలే.
Wednesday, April 1, 2015
D28
ఏంచేస్తావురాంటే అదేం ప్రశ్న ఇంజనీరింగే కదాని అప్లికేషన్ పట్టి
ర్యాంకు ఎంతంటే అదెందుకులే అన్నోడి కాలేజిలో ఫీజు కట్టి
గ్రూపేదంటే ఏదైతే నీకేంలే ముందు అమీర్పేటా అమెరికానాని కనిపెట్టి కదిలితే
మూడు సార్లు వీసావోళ్ళు మళ్ళపోదువులేంటే మావాడు అమీర్పేటకి, ముప్పై జాబులోల్లు మళ్ళరాపో అంటే నేను అమెరికాకొచ్చిపడ్డా .
మనిషి జీవితానికి నాలుగు దశలు, మావాళ్ళ జీతానికీ నాలుగే దిశలు
బాల్యం, ఇంజనీరింగ్, అమీర్పేట, అమెరికా......

Monday, March 30, 2015
D27
తాళి బొట్టు కట్టాలంటే చేతిలో కొత్తింటి తాళాలు పెట్టాలి
తలంబ్రాలు పోయాలంటే బంగారు ఆభరణాలు అర్పించుకోవాలి
ఎడడగులు వేయాలంటే ఎకరాలు రాసివ్వాలి.
ఇలా వున్నోడిస్తూనే వున్నాడు, లేనోడు చస్తూనే వున్నాడు
ఆశున్నోడు అడుగుతూనే వున్నాడు,కష్టాల్లో వున్నోడు కన్నీళ్ళతో కాళ్ళు కడుగుతునే వున్నాడు
చదువుకున్నోడూ సాంప్రదాయమని సరిపెడుతున్నాడు, కానుకలు చదివించే కన్నోళ్ళు ఇదేం వ్యాపారమని లోలోన కుమిలిపోతున్నారు.
చూసేవాడికే అది పచ్చటి పందిరి, పెళ్ళనే సందడి
పిల్లని పంపి పందిరి దింపిన పేదోడికి చివరకి మిగిలేవి తీరని అప్పులు, తమ చిన్నారి జ్ఞాపకాలే.
ఆకలికి తెలుసు అన్నం విలువ, రైతన్నకి తెలుసు మట్టి చలువ
ఇలా అన్నీ అడుక్కునేవాడికేం తెలుసు అమ్మాయి విలువ.

Sunday, March 29, 2015
Sunday, February 8, 2015
D24
ప్రేమ పంచుకుంటే పెరుగుతుంది, అర్ధం చేసుకుంటే అసలు బాధ తెలుస్తుంది.
పది మంది చుట్టూ తిరిగేది పరువు, పొగిడితే పరుగులెడుతుంది, ఛీ కొడితే చిన్నబోతుంది.
మందనొదిలి మదినడిగితే చెబుతుంది ప్రేమ ముందు పరువెంత పనికిమాలిందో.
అమ్మయినా, అమ్మాయినైనా ప్రేమించే మా మనసొకటే.
పరువు తీసేదే ప్రేమని మీరంటే , అమ్మా నాన్నలుగా మీ ప్రేమకర్దమే లేదు.

Sunday, January 18, 2015
D23
నేను ఇచ్చాననుకుంటే అప్పు, ఇవ్వాలనుకుంటే సాయం.
వాడివ్వాలనుకుంటాడు, అది వాడి గొప్పతనం, మీరది వాడుకోవాలనుకుంటే చివరకి మీకు కరువయ్యేది ఆ మానవత్వమే.

Monday, January 12, 2015
D22
మావా మందేద్దామా అంటే..
మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం, మధ్యలోనే వదిలేసిపోయే మగువను ప్రేమించటం మనసుకి ప్రమాదకరమని మతి తప్పి తిరుగుతున్నాడ్రా వాడు..

Saturday, January 10, 2015
Subscribe to:
Posts (Atom)