Wednesday, April 8, 2015

మేనేజర్ బాధితులు

ప్రియమైన మా మేనేజర్ మంకులత గారికి,

మేమీ ఉత్తరం మీరు మారతారన్న ఆశతో రాయట్లేదు, మాలాంటి వాళ్ళు ఇంకెందరో ఆరిపోతారేమోన్న ఆవేదనతో మొదలెడుతున్నాము.

క్లాసులో పిల్లల్లాగా, మీరు ఆఫీసోచ్చేసరికి అందరూ ఉండాలి అన్నీ సర్దుకొనేప్పుడూ అగుపడాలి.
మీరోచ్చేది మధ్యలో, వాగేదంతా ఫోన్లో, మాకు పనిచ్చేదేమో చీకట్లో.
జైల్లో వున్నోడు కూడా సూర్యోదయం, సూర్యాస్తమయం చూస్తాడు. మేమేమో మీరోస్తేగాని పొద్దెక్కదని పనిస్తేగాని  పొద్దుదిగదని అనుకుంటూ గడుపుతుంటాం.
ఎండ్ ఆఫ్ ది డే అంటే ఆఫీసు అయిపోతే అంటారనుకొనేవాళ్ళం , మా ఎండ్ చూసేవరకు ఆఫీసు అయిపోదనేది ఇక్కడికొచ్చాకనే తెలిసింది.

సెలవని మీ దగ్గరికి వెళ్ళాలంటే క్యాజ్వల్ లీవ్ అడగడానికి కాశ్మీర్ బార్డర్ చేరుతున్నంత భయం.
ఫోన్లో అందరికి అన్నీ చేస్తానని మాటిస్తారు, ఆదివారాలు రమ్మని మా తాట తీస్తారు.
పనిచేసి తలెత్తుకొని ఇంటికెల్లాల్సిన మావాళ్ళు , తల తిప్పితే మీకెక్కడ పట్టుబడిపోతారోనని దొంగల్లా తప్పించుకు తిరుగుతున్నారు.

ఏదైనా ప్రాబ్లమంటే మీటింగు రూమంటారు , మా బాధ మెమరీ చిప్ అంత చిన్నదయితే  మీ సమాధానం
మేమసలెందుకొచ్చామో కూడా మర్చిపోయి మతితప్పి తిరిగేంతలా వుంటుంది.

రేటింగంటారు, మీటింగు పెడతారు, మాకు కోటింగిస్తారు.
బయటకొచ్చాక తెలుస్తుంది అది రేటింగు కాదు చీటింగని.

ఇక జూనియ్యర్లంటే మీకు అడ్డమీద దొరికే కూలీల లెక్క
రాత్రి లేదు బాత్రూం లేదు, అవసరముందా ఫోన్ కొట్టు పనికి పెట్టు.

మీకు ఒక్కసారైనా ఎదురు తిరిగి మాట్లాడినోడు మాకు హీరో.
ఆ తరువాతే, వాడ్ని సైడ్ క్యారెక్టర్లకి కూడా పనికిరాని జీరోని చేస్తారు.

మీరు పెట్టె గోల్స్ అసలీ గ్లోబ్లో వుంటాయా అనిపిస్తుంటది.
అది తెలిసికూడా ట్రై చేసేవాడు పిచ్చోడు, తెలియక చేసేవాడే  కొత్తగా వచ్చిన బకరగాడు.
వాళ్ళంతా కాలేజీ ర్యాగింగుల్లో కింగులు, ఇప్పుడు మీతో వుంటే తెలుస్తుంది వాళ్ళకి వాటి అసలర్ధాలేంటో
అన్నట్టు ఒక ఐడియా, మీ ఇంట్లో పనులు కూడా గోల్స్ లో ఆడ్ చేసి చూస్తే పోలా , కనీసం అదొక్కటైనా చేసి చస్తారేమో చూద్దాం.

మీ జీవితమేంటో మాకు తెలియదు, కాని అందరి జీవితాలు మీలా వుంటాయనుకోవడం అన్యాయం కదమ్మా మంకు..
మీలాంటి మేనేజర్లు వున్నంతవరకు సాఫ్ట్వేర్ జాబంటే నరకం, స్కూల్ లైఫే ఆనందం, కాలేజోక అద్భుతమని అనిపిస్తూనేవుంటుంది.

                                                                                                   ఇట్లు
                                                                                           మీ బాధితులు


No comments:

Post a Comment